శాలిహుండం
శాలిహుండం వంశధారానది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. పూర్వపు ఓడరేవు పట్టణమైన కళింగ పట్నానికి పడమర వైపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శాలిహుండంలోని శిథిలాలు చాలామటుకు చివరి బౌద్ధ కాలానికి చెందినవి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు.
శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నాడు. ఆ తరువాత ఈ ప్రదేశంలో ఎ.హెచ్.లాంగ్‌హర్ట్‌స, టి.ఎన్.రామచంద్రన్, ఆర్.సుబ్రహ్మణ్యన్ తదితరులు త్రవ్వకాలు జరిపి నివేదిక ప్రచురించారు. త్రవ్వకాలలో శల్యపేటికలు, నాలుగు స్థూపాలు, ఒక చైత్య గృహం, అనేక శిల్పాలు బయటపడ్డాయి. క్రీపూ 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన, హీనయాన మొదలైన మూడు బౌద్ధాల యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి