అపురూప శిల్పకళా శోభితం శ్రీకూర్మం
March 14, 2013
మత్స్యావతారుడైన శ్రీ
మహావిష్ణువుకు ఈ భూమిపై గల ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని
శ్రీకూర్మం. అందుకే దీనికి ఎనలేని విశిష్టత ఉంది. మహావిష్ణువు అవతారాల్లో
రెండోదైన కూర్మావతారం రూపంలో దైవం ఈఆలయంలో కొలువై ఉంటుంది. అమృతానికై
దేవదానవులు క్షీరసాగరమధనం చేయడానికి మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని
తాడుగా ఉప యోగించారు. ఆసమయంలో వత్తిడికి లోనైన మంధర పర్వతం క్షీరసాగరంలోకి
మునిగిపోతుంటే శ్రీమహావిష్ణువు కూ ర్మావతారాన్ని ధరించి పర్వతం కింద
ఆధారంగా నిలచి అమృత మధనానికి సాయం చేశాడు. అటువంటి ఆపురూప అవతా రం . ఈ ఆలయంలో
ఈనెల 25నుంచి 27వ తేదీ వరకూ అత్యంత వైభవంగా డోలోత్సవాలను
నిర్వహిస్తున్నారు.
ఆలయ విశిష్టత
శ్రీకాకుళం జిల్లా, గార మండలం శ్రీకూర్మం గ్రామంలో శ్రీకూర్మనాథ స్వామి ఆలయం విశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. పెద్ద ప్రాకారా నికి వెలుపల ‘శ్వేత పుష్కరిణి’ ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్ధి నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రిక ఆధారాలు స్పష్టం చేస్తు న్నాయి. ఈ ఆలయంలోని ప్రతీ శిల్పం ఒక అపూరూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతో మంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమై పోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగాంధ్ర చరిత్రకు అమూల్యా ధారాలుగా నిలుస్తాయి. అత్యద్భుతమైన వాస్తు కళతో ఆలయం అలరా రుతూ ఉంటుంది. ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్నీ ఏకశిలతో రూపు దిద్దుకున్నవే. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమ ణీయంగా మలిచారు.
స్థల పురాణం
ఈమట్టితో తిరునా మాలు దిద్దు కోవడం అత్యంత శుభప్రదమని భక్తుల విశ్వాసం.శ్రీకూర్మంలోని పాతాళ సిద్ధేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే శ్రీకూర్మనాథ స్వామిని దర్శించాలని అం టారు. హటకేశ్వరుడు, కర్పూరేశ్వరుడు, కోటీశ్వరుడు, సుందరీశ్వరుడు, పాతా ళసిద్ధేశ్వరుడు శ్రీకూర్మక్షేత్రానికి క్షేత్ర పాలకులు. ఈ ఆలయాన్ని భగవత్‌రామానుజులు, కృష్ణ చైతన్యుడు వంటి ప్రముఖు లెందరో సందర్శిం చి కూర్మనాథుని దర్శనాన్ని చేసుకున్నారు.అన్ని రకాల వైష్ణవ క్షేత్ర ఉత్స వాలు ఇక్కడ జరుగుతాయి. ఈ నెల 25వ తేదీనుంచి 27వ తేదీ వరకూ డోలోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటిరోజు కామదహనం, రెండో రోజు పడియ, మూడో రోజు డోలోత్సవాన్ని నిర్వహిస్తారు.శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉ న్న ఈఆలయానికి వాహన సదుపాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మార్గమధ్యం లోని అరసవల్లి శ్రీసూర్యనారా యణ స్వామిని దర్శించుకుని భక్తులు శ్రీకూర్మం చేరుకోవచ్చు.
---బెందాళం కృష్ణారావు, (మేజర్ న్యూస్ ప్రతినిధి- శ్రీకాకుళం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి