వాసుదేవ ఆలయం
ఆలయ చరిత్ర: ఆ కాలంలో మందసా రామానుజులనే ప్రసిద్ధ వేదవిద్వాంసులు ఈ ఆలయప్రాంగణంలోనే వేదవిద్యను నేర్పుతూ కాశి వరకు కూడా పర్యటించి పలు వురు వేద విధ్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మానపత్రాలను పొందారట. మందసా రామానుజుల కీర్తిని గురించి తెలుసుకున్న చిన్నజీయరు స్వామివారి గు రువు పెద్దజీయరు స్వామివారు, వారి మిత్రులు గోపా లాచార్యస్వామివారితో కలసి నేటి రాజమండ్రి నుంచి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందసకు వేంచేయడం జరిగింది.వారిని ఆదరించిన మందసా రామా నుజులు వారిచే శ్రీభాష్యం అధ్యయనం చేయించడానికి అంగీకరించారు. నాటి రాత్రి ఆలయప్రాంగణంలో నిద్రిం చిన శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చిన గోదావరి వంతెన విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు కలవచ్చినది. అది అపశకునంగా భావించిన శిష్యులిద్దరు తమ విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుందేమోనని భయపడుతూ గురువు గారివద్దకు వెళ్ళి కల సంగతి చెప్పారు. గురువుగారు వారిని ఊరడించి ఆలయంలో వేంచేసియున్న శ్రీ వాసుదేవ పెరుమాళ్ వద్దకు వారిని తీసుకుని వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారం చేయించి, వారు కూడా చేసినారట. ఆ సమయంలో వాసుదేవుని విగ్రహం నుండి ఓ దివ్యమయిన కాంతి ప్రసరించినదట. వాసుదేవుని అనుగ్రహం వల్ల శిష్యులిద్దరు సుమారు 2 సంవత్సరాలలో పూర్తికావలసిన శ్రీభాష్యం అధ్యయనాన్ని కేవలం 6 నెలలలోనే పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం అయ్యారట. అందుకని ఇక్కడి దేవుని జ్ఞానప్రదాతగా, అభయప్రదాతగా భక్తులు కొలుస్తారు.
గురువు పెద్దజీయరు స్వామి వారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమయిన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రస్తుతం గుడి మాన్యం తిరిగి దేవునికే చెందేలా చర్యలు తీసుకోబడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం మొదలగు వాటికి సమానంగా ఈ ఆలయం కూడా క్రమేపి ప్రాధాన్యత పొందుతున్నది. జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలు మరియు ఒరిస్సా నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడ తాయి. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆల యం తప్పక సందర్శించతగినది.దగ్గరలో ఉన్న స్టేషన్ పలాస (18 కిమీ). జాతీయ రహ దారి 5 నుండి కేవలం 5 ి.మీ.లు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి 100 కి.మీ.లు. విశాఖపట్నం నుండి 200 కి.మీ.లు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి